భారత జవానును గురిచూసి, కంటిలో కాల్చి చంపిన పాక్ సైన్యం
ఒకవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ, మరోవైపు పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ చర్చలకు సిద్ధమవుతున్న వేళ సరిహద్దుల్లో పాక్ సైన్యం బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి ఓ భారత జవానును బలిగొంది. వాస్తవాధీన రేఖ వద్ద స్నిప్పర్ ఫైర్ జరిగిందని, బారాముల్లా సెక్టారులోని కరాం పోస్టు వద్ద ఈ ఘటన జరిగిందని సైన్యాధికారి ఒకరు తెలిపారు. ఈ దాడిలో గార్డ్ డ్యూటీలో ఉన్న జవాను చనిపోయాడని, గురిచూసి అతని కంటిలో కాల్చారని పేర్కొన్నారు. కాగా, ఈ వారంలో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది మూడోసారి. సోమవారం రాత్రి సరిహద్దుల వెంబడి మోటార్ లాంచర్లతో పాక్ దాడులు చేసిన సంగతి తెలిసిందే.